నా టాలెంట్‌ చూసి చాలామంది అబ్బాయిలు వెంటపడ్డారు.. Aada Sharma

by Anjali |   ( Updated:2023-06-25 15:18:43.0  )
నా టాలెంట్‌ చూసి చాలామంది అబ్బాయిలు వెంటపడ్డారు.. Aada Sharma
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ ఆదాశర్మ తనకున్న నైపుణ్యాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇటీవల తాను నటించని ‘ది కేరళ స్టోరీ’ విజయాన్ని ఆశ్వాదిస్తున్న బ్యూటీ.. ఈ మధ్య వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తెగ హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ సమావేశంలో తన టాలెంట్‌కు సంబంధించిన విషయాలు వెల్లడిస్తూ.. ‘నేను నా అద్భుతమైన వంట నైపుణ్యాలతో చాలా మంది అబ్బాయిలను ఆకర్షించాను. చాలా రకాల అసాధారణమైన టేస్టీ ఫుడ్ వండగలను. కొత్త పద్ధతుల్లోనూ విభిన్న రుచులను చూపించగలను. ఇవన్నీ మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ షెఫ్ మా అమ్మమ్మే. నేను ఆమెను కలవడానికి వెళ్లినప్పుడు ప్రతి ఆదివారం 10 రకాల భోజనాన్ని రెడీ చేస్తుంది’ అంటూ గ్రాండ్ మదర్‌పై ప్రశంసలు కురిపించింది.


Advertisement

Next Story