- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శోభనం గదిలో భర్తకు మందు పోసిన భార్య.. నెట్టింట ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోన్న పోస్టర్
దిశ, సినిమా: బిచ్చగాడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో విజయ్ ఆంటోని.. ప్రస్తుతం మరో ఢిపరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విజయ్ మొదటిసారిగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జానర్‌లో నటిస్తున్నాడు . ‘లవ్ గురు’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి హీరో అండ్ నిర్మాతగా విజయ్ ఆంటోనినే చేస్తున్నాడు. ఈ చిత్రానికి వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించగా.. మృణాళిని రవి కథానాయికగా నటిస్తోంది.
రీసెంట్‌గా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగా.. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ పోస్టర్‌లో శోభనం రోజు గదిలో భార్య.. భర్తకు పాలకు బదులు మందు, గ్లాసులో పోసి ఇస్తుంది. దీంతో భర్త ఆశ్చర్యపోతూ చూస్తుంటాడు. భార్యభర్తలుగా విజయ్ ఆంటోని-మృణాళిని కనిపించిన ఈ పోస్టర్ ప్రస్తుతం అబ్బాయిలకు తెగ ఇంట్రెస్ట్ తెప్పిస్తోంది. ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామంటూ సోషల్ మీడియాలో కామెంట్ల మోత మోగిస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ విడుదల తేదీ మాత్రం ప్రకటించలేదు.
ఇక హీరో విజయ్ ఆంటోని వ్యక్తిగత విషయానికొస్తే.. గత ఏడాది ఈ హీరో పెద్ద కుమార్తె సెప్టెంబరు 19 వ తారీకున ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 16 ఏళ్లకే మీరా బలవన్మరణానికి పాల్పడటం కోలీవుడ్ ఇండస్ట్రీలో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. విజయ్ అండ్ అతని సతీమణి ఇంకా కూమార్తె మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.