- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టైలిష్ విలన్‌కు బర్త్‌డే విషెస్
దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో జగపతిబాబు.. ప్రస్తుతం అన్ని రకాల పాత్రలు పోషిస్తూ ఆల్‌రౌండర్ అనిపించుకుంటున్నారు. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ అత్యంత బిజీ ఆర్టిస్టుగా కెరీర్‌ను లీడ్ చేస్తూ.. స్టైలిష్ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. తన కెరీర్ తొలినాళ్లలో ‘పెద్దరికం, శుభలగ్నం, మావిచిగురు, పెళ్లిపీటలు’ వంటి కుటుంబ కథా చిత్రాల ద్వారా మహిళా అభిమానులను సొంతం చేసుకున్న జగ్గూభాయ్.. నటరత్న శోభన్ బాబు తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ పెంచుకున్న హీరోగా గుర్తింపు పొందారు.
Team #Roberrt wishing @IamJagguBhai a very Happy Birthday!💐✨#HBDJagapathiBabu#RoberrtTrailerRoarOnFeb16 #Roberrt #DBoss @dasadarshan #RoberrtStormMarch11 @TharunSudhir @umap30071 @StarAshaBhat pic.twitter.com/iq16BBmEoV
— Shreyas Group (@shreyasgroup) February 12, 2021
తర్వాతి కాలంలో ఆయన హీరోగా నటించిన సినిమాలు అంతగా ఆడకపోవడంతో పునరాలోచనలో పడ్డ జగ్గు.. బాలయ్య ‘లెజెండ్’ మూవీతో విలన్‌గా మారారు. ఇక అప్పటి నుంచి మళ్లీ వెనక్కితిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఈ క్రమంలోనే విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ‘లెజెండ్’ చిత్రం తర్వాత జగ్గుభాయి నటించిన ‘రంగస్థలం, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో’ వంటి సినిమాల్లో తన పర్ఫార్మెన్స్‌కు ఫిదా కాని ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయా క్యారెక్టర్లలో అంతలా జీవించారు. ప్రస్తుతం ‘మహాసముద్రం, లక్ష్య’తో పాటు పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఆయన ప్రధానపాత్రలో నటించిన ‘FCUK’ (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్) ఈ రోజు రిలీజైంది.
https://twitter.com/UrsVamsiShekar/status/1360106303373254656?s=20
కాగా ఆయన బర్త్ డే సందర్భంగా ‘మహాసముద్రం, లక్ష్య, రాబర్ట్, టక్ జగదీష్2’ మూవీ యూనిట్స్ బర్త్‌డే విషెస్ తెలిపాయి.