MRO ఆఫీస్‌లో ప్రేమ జంట.. పాయిజన్ తాగిన తల్లి

by Mahesh |   ( Updated:2021-05-11 04:55:46.0  )
MRO ఆఫీస్‌లో ప్రేమ జంట.. పాయిజన్ తాగిన తల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు.. తండ్రిలేకపోయినా ఆమెను ఎంతో గారాబంగా పెంచింది ఆ కన్నతల్లి. ఉన్నతస్థాయిలో ఆమెను నిలబెట్టడానికి తన కోరికలను చంపుకొని రూపాయి రూపాయి కూడబెట్టి బిడ్డను ప్రయోజకురాలిని చేసింది. కానీ కూతురికి తల్లిప్రేమ కన్న అబ్బాయి ప్రేమ ఎక్కువ గా కనిపించింది. తల్లిని కాదని ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోయింది.. తనతో పాటు రమన్న తల్లిని కాలితో నెట్టేసింది. దీంతో మనస్తాపానికి గురైన తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కూతురి ప్రేమ వ్యవహారం కన్నతల్లి ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన అనంతపురంలో చోటుచేసుకొంది. వివరాలలోకి వెళితే..

చోళసముద్రానికి చెందిన రాజమ్మ తన కూతురితో కలిసి నివాసముంటుంది. కూతురు లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటుంది. అయితే ఈ నెల 7వ తేదినుండి రాజమ్మ కూతురు అదృశ్యమైంది. రాజమ్మ కూతురు కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో రాజమ్మ కూతురు ప్రేమించినవాడితో వెళ్లిపోయిందని తెలియడం తో షాక్ కి గురైంది. ఈ క్రమంలో స్టేట్‌మెంట్‌ రికార్డు చేసేందుకు పోలీసులు సోమవారం తహసీల్దార్‌ కుమార్‌స్వామి ఎదుట అమ్మాయిని హాజరుపరిచారు. అయితే ఆ సమయంలో తన కూతుర్ని ఇంటికి రావాల్సిందిగా రాజమ్మ బతిమాలాడింది. కానీ కూతురు మాత్రం తాను తల్లితో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా లేనని తెగేసి చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన రాజమ్మ అక్కడే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆమెను 108 లో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story