అఖిల్, పూజల క్వారంటైన్ రొమాన్స్

by Jakkula Samataha |
అఖిల్, పూజల క్వారంటైన్ రొమాన్స్
X

అఖిల్ అక్కినేని మూడు చిత్రాలు చేసినా సరైన హిట్ అందుకోలేదు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినా నిరూపించలేక పోయాయి. దీంతో కొడుకు కెరియర్ గురించి బాగా ఆలోచించిన కింగ్ నాగార్జున నాలుగో చిత్రం అయినా బ్లాక్ బస్టర్ హిట్ కావాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకే గీతా ఆర్ట్స్ బ్యానర్‌ను ఎంచుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమాకు ప్లాన్ చేశాడు. ఆయన డైరెక్షన్‌లో వస్తున్న మూవీ ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్’ కాగా.. సినిమా ఫస్ట్ లుక్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

లక్కీ గర్ల్ పూజా హెగ్డే అఖిల్‌తో జతకట్టగా గ్లింప్స్ ఆఫ్ క్వారంటెన్ అంటూ రొమాంటిక్ పోస్టర్‌ను మూవీ యూనిట్ బుధవారం రిలీజ్‌ చేసింది. అఖిల్ వర్క్ ఫ్రమ్ హోంలో బిజీగా ఉండగా.. పూజా తనను డిస్టర్బ్ చేస్తున్న రొమాంటిక్ ఫొటో విడుదల చేసిన మూవీ యూనిట్.. సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. సినిమాకు బన్నీ వాసు నిర్మాత కాగా, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు.

Advertisement

Next Story