- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూన్ 5న వస్తున్న మంచు విష్ణు ‘మోసగాళ్లు’
దిశ వెబ్ డెస్క్: మంచు విష్ణు ప్రస్తుతం ‘మోసగాళ్లు’ అనే హాలీవుడ్-ఇండియన్ సినిమా చేస్తున్న విషయం విదితమే. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంతో రూపొందుతన్న ఈ చిత్రానికి జెఫ్రీ గీ చెన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా వేసవి సెలవుల్లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవడంతో.. విడుదల తేదిని వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మంచు విష్ణు రివీల్ చేశారు. తెలుగు చిత్రం జూన్ 5న, ఆంగ్ల చిత్రం జులైలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంతో రూపొందుతున్న ‘మోసగాళ్లు’ సినిమా షూటింగ్ 2019 మొదట్లో ఆరంభమైంది. రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఐటీ స్కాం గురించి ఈ సినిమాలో చర్చించనున్నారు. లాస్ ఏంజెల్స్, హైదరాబాద్ లలో వేగంగా షూటింగ్ చేసిన‘మోసగాళ్లు’ చిత్రం.. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల ‘మోసగాళ్లు’ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ఆ పోస్టర్లలో అర్జున్‌గా విష్ణు, అను పాత్రలో కాజల్ అగర్వాల్, ఏసీపీ కుమార్‌గా సునీల్ శెట్టి కనిపించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రం కోసం సుమారు రూ. 3.5 కోట్ల వ్యయంతో కూకట్‌పల్లిలో ఓ భారీ ఐటీ ఆఫీస్ సెట్‌ను నిర్మించారు. ఈ సెట్ లో షూటింగ్ జరుగుతుండగానే కరోనా ప్రభావంతో ఆపేశారు. దాదాపు చిత్రీకరణ పూర్తయిందని అందుకే విడుదల తేదీని ఖరారు చేశామని మంచు విష్టు తెలిపారు. హాలీవుడ్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మంచు విష్టు నిర్మిస్తున్నాడు. నవీన్ చంద్ర, నవదీప్, రూహీ సింగ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Tags: mosagallu, manchu vishnu, kajal agarwal, navdeep, sunil shetty, tollywood, telugu cinema