- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చెట్టు తొర్రలో చక్కగా ఒదిగిన వానరం
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్ : చెట్టు తొర్రలో చక్కగా ఒదిగిపోయిన వానరం ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పెంచ్ నేషనల్ పార్కులో ఫొటోగ్రాఫర్ ఆమన్ విల్సన్ కెమెరాకు ఈ దృశ్యం చిక్కింది. నిజానికి ఆయన లంగ్డీ అనే ఆడపులిని ఫొటోలు తీయడానికి వెళ్లారు.
ఆ పులి సామ్రాజ్యం అంతా కలియ తిరిగినా ఎక్కడా కనిపించలేదు. నిరాశతో వెనుతిరిగి వెళ్తుండగా కోతుల ( వాటిని లాంగూర్ అంటారు) గుంపు ఆడుకోవడం, గెంత్తడాన్ని గమనించారు. అందులో ఓ వానరం చెట్టు ఎక్కడం గమనించారు. అదీ చకచకా పైకి ఎక్కి చెట్టుకున్న ఉన్న తొర్రలో ఎంచక్కా ఒదిగిపోయింది. ఆ దృశ్యాన్ని ఆమన్ క్లిక్‌మనిపించారు. ఈ ఫొటోను సోషల్ మీడియా ఉంచగా వైరల్ అయ్యింది.
Next Story