- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోనాల్ ఫ్యాన్స్ సూపర్ ప్లాన్..
దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 4 చూసిన వారందరికీ మోనాల్ గజ్జర్ సుపరిచితమే. అభి, అఖిల్‌తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ద్వారా మరింత ఫేమస్ అయింది. దీంతో మోనాల్ గురించి నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. కేవలం గ్లామర్ లుక్ కోసమే తనను బిగ్ బాస్‌లో కంటిన్యూ చేస్తున్నారని.. నిజానికి ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిందని కామెంట్ చేస్తున్నారు. అనవసరంగా కుమార్ సాయిని ఎలిమినేట్ చేసి, స్ట్రాంగ్ కంటెస్టెంట్‌కు బిగ్ బాస్ నిర్వాహకులు అన్యాయం చేశారని.. షోకు అట్రాక్షన్ పెంచేందుకు ఇలా చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. కొందరైతే మోనాల్‌పై వ్యక్తిగత దూషణలకు కూడా పాల్పడుతున్నారు. ఇంకొందరు సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారు. ట్రోల్స్ కూడా చాలా ఎక్కువయ్యాయి.
దీంతో మోనాల్ అభిమానులు ఇది పద్ధతి కాదని అంటున్నారు. అభి, అఖిల్‌తో మోనాల్‌కు ఉన్నది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమేనని.. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదని చెప్తున్నారు. తనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా సరే.. తెలుగు నేర్చుకుంటూ తెలుగులోనే మాట్లాడుతోందని.. ఈ విషయంలో అభి, హారిక కన్నా కూడా తను చాలా బెటర్ అని అంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇక్కడ లాక్ డౌన్ హీరో సోనూ సూద్‌ను ట్యాగ్ చేశారు మోనాల్ అభిమానులు.
సార్.. మా మోనాల్‌ను అనవసరంగా కామెంట్స్ చేస్తున్నారని వాపోయారు. లాక్ డౌల్లో అంత మందికి సహకరించిన మీరు మా మోనాల్‌కు కూడా హెల్ప్ చేయండని లెటర్ రాశారు. తనకు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యేలా సపోర్ట్ చేయాలని.. బిగ్ బాస్ విన్ అయ్యేందుకు సహాయం చేయాలని కోరారు. మొత్తానికి మోనాల్ ఫ్యాన్స్ మంచి ప్లాన్ వేశారని అనిపిస్తోంది. నేషనల్ హీరో అయిన సోనూ సూద్‌కు లెటర్ రాయడం.. ఆయన స్పందించడం వల్ల ఈ విషయం దేశం మొత్తానికి తెలుస్తుంది. అప్పుడు మోనాల్‌కు సపోర్ట్ చేస్తూ ఓట్ల వర్షం కురుస్తుంది. దీంతో ఆటోమేటిక్‌గా బిగ్ బాస్ విన్నర్ అవుతుంది అనేది ప్లాన్.