ఆక్రమణలపై సమగ్ర విచారణ జరపాలి: రాంచందర్ రావు

by Shyam |
ఆక్రమణలపై సమగ్ర విచారణ జరపాలి: రాంచందర్ రావు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికార పార్టీ నేతలు ప్రభుత్వ స్థలాలను యధేచ్చగా కబ్జాలు చేస్తూ..అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. ఆయా కబ్జాలు, నిర్మాణాలపై సమగ్ర విచారణ జరుపాలని ఆయన డిమాండ్ చేశారు. సాక్షత్తు రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి.. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి, తన పేరిట ఆసుపత్రి నిర్మించారని ఆరోపించారు. కీసరలో మీడియా సమావేశంలో మంగళవారం రాంచందర్ రావు మాట్లాడుతూ… ఇటివల జవహర్ నగర్‌లోని ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాన్ని నిర్మూలించేందుకు రెవెన్యూ, మున్సిపల్ యంత్రాంగాలు వెళ్లిన ఘటనలో సీఐ బిక్షపతిరావుపై జరిగిన పెట్రోల్ దాడిపై తమ పార్టీ ఖండిస్తోందన్నారు.

ఆ దాడి ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. అధికార పార్టీ నేతల అక్రమణలను ప్రోత్సహించాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులపై తీవ్ర ఒత్తిడి పెరిగిందన్నారు. 30 ఏళ్ల జవహర్ నగర్ సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ జవహర్ నగర్ వాసులకు పట్టాలు ఇస్తామని చెప్పి, మాట తప్పారని ఆరోపించారు. ఏండ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇండ్లను కూల్చొద్దని అన్నారు. వారికి రేషన్ కార్డులు, ఇంటి నెంబర్లను కేటాయించి, పన్నులను వసూలు చేస్తున్నందున జీవో 58,59 ల కింద క్రమ బద్దీకరించాలని డిమాండ్ చేశారు. ఇటివల జరిగిన జవహార్ నగర్ ఘటనలో బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడాన్ని బీజేపీ ఖండిస్తోందన్నారు.

Advertisement

Next Story

Most Viewed