ఆ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయండి.. ప్రభుత్వానికి జీవన్ రెడ్డి హెచ్చరిక

by Shyam |
MLC Jeevan Reddy
X

దిశ, హుస్నాబాద్: కాళేశ్వరం జలాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అందించిన తర్వాతే రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు మళ్లించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం హుస్నాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్, రంగనాయక సాగర్‌తో పాటు ఇతర ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు ఏ ప్యాకేజీ అందించారో హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న నిర్వాసితులకు కూడా అదే ప్యాకేజీని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా.. వచ్చే అక్టోబర్ కల్లా గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, లేకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, జిల్లా నాయకులు లింగమూర్తి, సత్యనారాయణ, అక్కు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed