- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి ఉచిత కరెంటు మీటర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
దిశ, జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వం రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత సబ్సిడీ, కరెంట్ మీటర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ విద్యుత్ మీటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కుల సంఘాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నారని అన్నారు. జగిత్యాల పట్టణంలో 50 లాండ్రి షాప్‌లను గుర్తించారని, ఇంకా అర్హులు ఉంటే వారిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి వర్గానికి తగిన ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు.
నేటి సమాజంలో ప్రతి కులం నుంచి ఉన్నత చదువులు చదువుకుని అనేక రంగాల్లో స్థిరపడ్డారని కులవృత్తులను నమ్ముకొని చాలామంది జీవనం కొనసాగిస్తున్నారని, దానిలో భాగంగానే కుల వృత్తులను నమ్ముకున్న వారికి కొంత ఆసరా కల్పించడానికి ముఖ్యమంత్రి ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం చేపట్టారని నమ్ముకున్న కులవృత్తి ద్వారా సమాజంలో గౌరవంగా బతకడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేదన్నారు. కానీ వారి కుల వృత్తులను కాపాడడం కోసం కొంత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. జిల్లాలో దాదాపు ఎనిమిది వందల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. నాయి బ్రాహ్మణులు, రజకులు సమాజంలో వారి కుల వృత్తి ద్వారా ప్రతి కుటుంబంతో అనుబంధం కలిగి ఉంటారని అన్నారు. మొన్నటి వర్షాలకు గంగపుత్రులు నష్టపోయారని జగిత్యాల నాయకుడు లేఖ రాయడం విడ్డురంగా ఉందని, కొన్ని చేపలు పోయిన మాట వాస్తవమేనని కానీ, ఈనాడు ముఖ్యమంత్రి చేప పిల్లలు ఇవ్వడం ద్వారా ఒక్కో చేప 5 నుండి 10కేజీల బరువుతో గంగపుత్రుల జీవనాదారంగా తయారయ్యాయని అన్నారు.
మీ ప్రభుత్వంలో ఒక చేప పిల్ల కూడా ఇవ్వలేదని ఎద్దేవ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఎప్పుడైనా కుల వృత్తుల అభివృద్ధి కోసం ఆలోచించారా అని ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. రజకుల కోసం ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ కప్పల శ్రీకాంత్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, రజక సంఘ పట్టణ అధ్యక్షుడు గొల్లపల్లి లింగం, జిల్లాఅధ్యక్షుడు మర్రిపల్లి నారాయణ, పోచాలు, మల్లేష్, రాజేందర్, దేవయ్య, తిరుపతి, శివ, విజయ్, కౌన్సిలర్లు బొడ్ల జగదీష్, ఏడిఈ జవహర్ నాయక్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.