‘నేను కూడా అయోధ్య రామాలయానికి వెళ్తా’

by Sridhar Babu |   ( Updated:2021-01-22 03:39:05.0  )
‘నేను కూడా అయోధ్య రామాలయానికి వెళ్తా’
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి విరాళాలు సేకరించడం పట్ల జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ రాముడు మనకెందుకు? మన వద్ద రాముడి ఆలయాలు లేవా? అని మండిపడ్డారు. అంతేగాకుండా అయోధ్య రాముడికి విరాళాలు ఇవ్వొద్దంటూ గురువారం ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శుక్రవారం మరోసారి దీనిపై ఆయన స్పందిస్తూ…

రాముడిని కించపరిచేలా తాను వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని బీజేపీ నేతలు రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. అంతేగాకుండా తనకూ విరాళాల పుస్తకం ఇస్తే.. తాను కూడా విరాళాలు సేకరిస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలను ఉద్దేశించే తాను వ్యాఖ్యానించానని, అంతేగానీ దేవుడికి అనాలని కాదని అన్నారు. తాను కూడా అయోధ్య రామాలయానికి వెళ్తానని.. బీజేపీ నేతలు దేవుడిని రాజకీయంగా వాడుకోవద్దని సూచించారు.

అంతేగాకుండా నిజామాబాద్ ఎంపీ అరవింద్ పెద్దా చిన్న లేకుండా అ గౌరవంగా మాట్లాడుతున్నారని అ పద్దతి సరి కాదని చెప్పడం జరిగింది అన్నారు. అధిష్టానం తనను మందలించ లేదని, ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగతమైనవని అన్నారు. దీంతో ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలపై బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యాసాగర్ రావు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Advertisement

Next Story