సీఎస్ దళితుడే కదా.. ‘ఈటల’పై TRS ఎమ్మెల్యే ఫైర్

by Sridhar Babu |   ( Updated:2021-06-30 07:45:04.0  )
Sunke-Ravishanker
X

దిశ, జమ్మికుంట : మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ దళితులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే, ఇల్లందకుంట ఇంచార్జ్ సుంకే రవిశంకర్ ఫైర్ అయ్యారు. మంత్రివర్గంలో ఈటల ఉన్నప్పుడు దళితులపై ఎందుకు మాట్లాడలేదని రవిశంకర్ ప్రశ్నించారు. బుధవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

CMOలో దళితులు లేరని చెబుతున్న ఈటలకు మతిభ్రమించిందని, సీఎస్ సోమేశ్ కుమార్ దళితుడు అన్న విషయం ఈటల మరిచిపోయారని మండిపడ్డారు. ఈటల తన సొంత డబ్బా కొట్టుకోవడంతో బీజేపీ అధిష్టానం సీరియస్ అయిందని అన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. దళితుల కోసం సీఎం కేసీఆర్ వందల కోట్ల నిధులు మంజూరు చేశారని, కొందరు విద్యార్థుల ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తే సహాయం కూడా అందజేశారని గుర్తు చేశారు.

Advertisement

Next Story