- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుర్గంధంలో… ఆహ్లాదకరమైన వాతావరణం
దిశ, ఎల్బీనగర్: మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటామని ఎంఆర్డీసీ చైర్మెన్, ఎమ్మెల్యే దేవిరెడ్డీ సుధీర్ రెడ్డి తెలిపారు. ఆదివారం మూసీ కార్పొరేషన్ ఎండీ. విశ్వజిత్ కంపాటి, చీఫ్ ఇంజినీర్ మోహన్ నాయక్, కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ సాగర్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి నాగోల్ బ్రిడ్జి క్రింద ముసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు ఎక్కడెక్కడ నాటాలో పర్యవేక్షణ చేశారు. మూసీనది సరిహద్దులు గుర్తించి, సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న దుర్గంధ పూరితమైన వాతావరణంలో మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మూసీ అంటే ముక్కు మూసుకొని పోయే రోజులు పోయే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మాలతి, ఎస్.ఈ.రామచంద్రరెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.