ములుగులో ఆ ఇద్దరికి కరోనా నెగిటివ్

by Shyam |
ములుగులో ఆ ఇద్దరికి కరోనా నెగిటివ్
X

దిశ, వరంగల్: ములుగు జిల్లాలో కొద్ది రోజుల‌ కిందట కరోనా పాజిటివ్‌తో గాంధీ హాస్పిటల్‌లో చేరిన ఇద్దరు పేషెంట్లకు మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. దీంతో వారిని గాంధీ వైద్యులు డిశ్చార్జ్ చేశారు. వీరిద్దరితోపాటు కుటుంబ సభ్యులను కూడా క్వారెంటైన్ నుంచి ఇంటికి తరలించారు. ఇంటికి చేరుకున్న వారిని ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. కరోనా సోకినా ధైర్యంగా ఉండటమే కాకుండా ప్రభుత్వానికి సహకరించి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చినందుకు ఆ ఇద్దరికి ఆమె భరోసానివ్వడమే కాకుండా అభినందించారు.

Tags: corona negative, 2 men, discharge, mla seethakka

Next Story

Most Viewed