ఏసీపీ ప్రకటన వందశాతం తప్పు : ఎమ్మెల్యే సీతక్క

by Shyam |   ( Updated:2021-06-04 04:41:55.0  )
ఏసీపీ ప్రకటన వందశాతం తప్పు : ఎమ్మెల్యే సీతక్క
X

దిశ, వెబ్‌డెస్క్: పోలీసులపై ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏసీపీ రంగస్వామి ప్రకటనపై స్పందించిన సీతక్క.. ఏసీపీ ప్రటకన వందకు వందశాతం తప్పు అని తప్పుబట్టారు. అక్కడ జరిగిన వాస్తవాన్ని తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని, పోలీసులు మానవత్వంతో పనిచేయాలని తెలిపారు. వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నిలు చేయకూడదన్నారు. తనవాళ్లు ములుగు కలెక్టరేట్ నుంచి వాహనానికి పాస్ తీసుకొని హైదరాబాద్ వెళ్లారని, రామంతపూర్‌లో వాహనాన్ని ఆపారని తల్లి ప్రమాదంలో ఉందని చెప్పినా డీసీపీ వినలేదని అన్నారు. తాను ఫోన్‌లో మాట్లాడే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదని సీతక్క స్పష్టం చేశారు. తన బంధువుల పట్ల డీసీపీ రక్షిత దురుసుగా ప్రవర్తించిందని సీతక్క ఆవేదన వ్యక్తం చేసింది.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed