- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ దేశంలోని ప్రభుత్వ సంస్థలను అంబానీ, అదానీలకు కట్టబెడుతున్నారు..
దిశ, హుస్నాబాద్: బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తుందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఏర్పాటుచేసిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. బీడు భూముల్లో పచ్చని పంటలు పండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రూపకల్పన, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రైతుల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుంటే, మోడీ ప్రభుత్వం మాత్రం రైతులు యాసంగిలో పండించే ధాన్యాన్ని కొనబోమని లేనిపోని కొర్రీలు పెడుతుందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అదాని, అంబానీలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి యాసంగిలో రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటన చేయాలన్నారు. లేదంటే రైతులతో కలిసి ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, ఎంపీపీ మానస, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ బాబు, మున్సిపల్ కౌన్సిలర్లు నళినిదేవి, సుప్రజ, రమాదేవి, హరీష్, మాజీ ఎంపీపీ వెంకన్న, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.