- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎమ్మెల్యే సామినేనికి హైకోర్టులో చుక్కెదురు..
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభానుపై 10 కేసులు ఉపసంహరించుకుంటూ.. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఏపీ జేఎఫ్ అధ్యక్షుడు కృష్ణాంజనేయులు హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కేసుల ఉపసంహరణ వ్యవహారంలో ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఒక్క జీవోతో 10 కేసులు ఎలా ఉపసంహరించుకుంటారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
ఈ కేసుల విషయంలో ప్రభుత్వం జీవో ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. ఎమ్మెల్యే ఉదయభానుకు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రవణ్ తన వాదనలు వినిపించారు. మూడువారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.
Next Story