ఎస్సై మృతి కలిచివేసింది : రేఖశ్యాంనాయక్

by Anukaran |
ఎస్సై మృతి కలిచివేసింది : రేఖశ్యాంనాయక్
X

దిశ, ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీస్ స్టేషన్ లోని రెండవ ఎస్సై నారాయణ మృతి పట్ల స్థానిక ఎమ్మెల్యే రేఖశ్యాంనాయక్ దంపతులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఎస్సై నారాయణ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచి వ్యక్తిని కోల్పోయామని, అతను నీతి నిజాయితీగా డ్యూటీ చేసేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చేర్మన్ అంకం రాజేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజగంగన్న, పర్మి సురేష్, ప్రదీప్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story