ఆవుల కోసం డీసీఎంను అడ్డుకున్న రాజాసింగ్

by Shyam |   ( Updated:2023-06-13 15:01:58.0  )
ఆవుల కోసం డీసీఎంను అడ్డుకున్న రాజాసింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: గోవధ నిషేధం ఉన్నా అక్రమంగా గోవులను తరలిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. యాదాద్రి భువనగరి జిల్లా చౌటుప్పల్ చెక్‌పోస్టు వద్ద ఆవులను తరలిస్తున్న డీసీఎంను పట్టుకుని స్థానిక పోలీసు స్టేషన్‌కు రాజాసింగ్ అప్పగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవధ నిషేధాన్ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు బుక్ చేస్తున్నారని మండిపడ్డారు. కానీ, గోవధ చేసే వారిపై కేసులు పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు వన్ సైడ్‌గా పని చేస్తున్నారని విమర్శించారు. ప్రతి రోజు గోవులను తరలిస్తున్న 60 వాహనాలు వెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed