సభ్యత్వం ఉంటేనే పథకాలు… ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

by Shyam |   ( Updated:2021-02-28 00:29:09.0  )
సభ్యత్వం ఉంటేనే పథకాలు… ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ సభ్యత్వం ఉంటేనే ఇకపై ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీని రక్షించుకోవడానికి ఇదే మార్గం అని పేర్కొన్నారు. రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇండ్లకూ ఇదే వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నికల వరకే రాజకీయాలు… ఆ తర్వాత సంక్షేమ పథకాలు అందరికీ అందించేలా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. ఇప్పటి నుంచి మూడేండ్ల వరకు టీఆర్ఎస్ మెంబర్ షిప్ ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అని అన్నారు.

Next Story

Most Viewed