- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆర్ఆర్ఆర్‌పై మరో ఎమ్మెల్యే ఫిర్యాదు
by srinivas |

X
దిశ ఏపీ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీలో ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకుంటున్నాయి. రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై మరో ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న మంత్రి శ్రీరంగనాథరాజు, ఈ ఉదయం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, రఘురామకృష్ణరాజుపై నరసాపురం పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే ప్రసాదరాజు ఫిర్యాదు చేశారు.
తనతో పాటు తన పార్టీ సహచర ఎమ్మెల్యేలను రఘురామకృష్ణరాజు ‘పందులు’ అంటూ అనుచితంగా వ్యాఖ్యలు చేశారని, తన పరువుకు నష్టం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో కోరారు. తమ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా రఘురామకృష్ణరాజు తీరు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Next Story