- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎమ్మెల్యే పెద్ది ప్రత్యేక పూజలు ఇందుకోసమేనా ?

దిశ,ఖానాపూర్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పాకాల సరస్సు మత్తడిపోస్తుంది. దీంతో బుధవారం ఉదయం నర్సంపేట శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్నతో కలసి మత్తడి వద్ద ప్రత్యేకపూజ నిర్వహించారు.
అనంతరం పెద్ది మాట్లాడుతూ.. గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పాకాల సరస్సు మత్తడిపడడం రైతులకు శుభ పరిణామమన్నారు. పాకాల ఆయకట్టు కింద ఉన్న వేల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు రెండు పంటలకు సరిపడా అందుతుందన్న దరిమిలా రైతన్నలకు శుభాకాంక్షలు తెలియజేసారు. మత్తడి వద్ద పర్యటకుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని తెలియజేసారు. సరస్సు నిండి మత్తడి పడుతుండడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం నెలకొంది. పెద్దితో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి, ఎంపీపీ ప్రకాష్ రావు ,జెడ్పీటీసీ స్వప్న-శ్రీనివాస్, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు, ఎంపీటీసీ,సర్పంచ్, రైతు సంఘాల కన్వీనర్లు, రైతులు పాల్గొన్నారు.