కేంద్రం తీరుపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. 

by Shyam |
కేంద్రం తీరుపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. 
X

దిశ, బొంరాస్ పేట్: రైతుల వరి ధాన్యం కొనుగోలు పై కేంద్రం చేతులెత్తేసిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని భూలక్ష్మి చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గుజరాత్ ధాన్యాన్ని కొంటారు గాని, తెలంగాణ ధాన్యాన్ని ఎందుకు కొనరు అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచైనా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కార్యాచరణతో ముందుకెళ్తామని తెలిపారు. యాసంగిలో ఆరుతడి పంటలు వేయాలని రైతులకు ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సూచించారు.

అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే విధానంలో భాగంగానే, కేంద్ర ప్రభుత్వం అహంకార ధోరణితో, రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్నారు. ప్రణాళికాబద్ధంగా, రాష్ట్ర మీద ద్వేషంతో వరిధాన్యంను కొనుగోలు చేయడం లేదన్నారు. కావున కేంద్ర ప్రభుత్వం పై కొట్లాడాల్సిన అవసరం వచ్చిందని శ్రీధర్ పేర్కొన్నారు. కేంద్రం అన్ని పంటలకు ఎమ్ఎస్‌పి (MSP) చట్టం అమలు చేయాలనీ డిమాండ్ వారు చేశారు. తర్వాత చావు డప్పు కొడుతూ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ హెమి బాయ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు చాంద్ పాషా, వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, మండల అధ్యక్షుడు కె.యాదగిరి, పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, రైతు సమితి మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు శ్రవణ్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, తిరుపతయ్య, ఎల్లప్ప, టిఆర్ఎస్ అధికార ప్రతినిధి టి.టి.రాములు, నాయకులు దేశ్యానాయక్, మహేందర్, రవి గౌడ్, శేఖర్ గౌడ్, హాజీ మలంగ్ బాబా, బండ శ్రీనివాస్, మల్లేష్ గౌడ్, చంద్రమోహన్, కట్టెల రాములు, రామకృష్ణ, లచ్చప్ప, ఖాజమైనద్దిన్, సలాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story