ఆధ్యాత్మిక చింతనతో.. మానసిక ప్రశాంతత

by Shyam |
ఆధ్యాత్మిక చింతనతో.. మానసిక ప్రశాంతత
X

దిశ, ముషీరాబాద్: ఆధ్యాత్మిక చింతన మానసిక ప్రశాంతతను చేకూరుస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని లక్ష్మీ గణపతి దేవాలయంలో ఆలయ ధర్మకర్తల నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాలల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందన్నారు. అనంతరం లక్ష్మీ గణపతి దేవాలయం చైర్మన్‌గా ఎన్నికైన ముచ్చ కుర్తి ప్రభాకర్ మరియు ఆలయ పాలకమండలి సభ్యులు, మాజీ చైర్మన్ మాచర్ల పద్మజ లను సన్మానించి అభినందించారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed