సాగర్‌లో కోవిడ్ టెస్టింగ్ సెంటర్ ప్రారంభం

by Shyam |
సాగర్‌లో కోవిడ్ టెస్టింగ్ సెంటర్ ప్రారంభం
X

దిశ, నాగార్జునసాగర్: కమలా నెహ్రూ హాస్పిటల్ పాత భవనంలో కోవిడ్-19(కరోనా) టెస్టింగ్ సెంటర్‌ను ఎమ్మెల్యే నోములు నర్సింహయ్య ప్రారంభించారు. అనంతరం రాపిడ్ టెస్ట్ కిట్ల పనితీరును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వినియోగం అత్యవసరం అన్నారు. వీటి ద్వారా 30 నిమిషాల్లో రిపోర్ట్ వస్తుందన్నారు. అనంతరం విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్‌లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

Advertisement

Next Story