- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్‌కి ఎమ్మెల్యే సవాల్.. ‘వాటి ధరలు తగ్గించండి’
దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్ని రోజులైనా సభను నడుపుతామని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్లు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. శుక్రవారం గన్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలన రాష్ట్రాలైన ఛత్తీస్‌ఘడ్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అల్లకల్లోలం అవుతున్నాయని, తెలంగాణలో మాత్రం సుస్థిరమైన పాలన కొనసాగుతుందని తెలిపారు. బండి సంజయ్‌కి దమ్ముంటే డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని ప్రజలకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ పాలనలో ప్రధానితో పాటు కేంద్ర క్యాబినెట్ ప్రశంసలు కురిపించారని మరీ మెడికల్ కాలేజ్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలు తెలంగాణకు మెడికల్ కాలేజీ తీసుకొస్తారా లేదో చెప్పాలని కోరారు. తెలంగాణ సొమ్ము కేంద్రం దగ్గర రెండు లక్షల కోట్లు ఉందని, కేంద్రం రాష్ట్రానికి సొమ్ములు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి చేయించడమే కాదు రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని రీడిజైన్ చేస్తున్నారని వెల్లడించారు. ఈటెల పై గెల్లు శ్రీనివాస్ గెలవబోతున్నాడని చెప్పారు. హుజురాబాద్ ప్రజలు ఓటు వేసింది కేసీఆర్‌కి, ఆయన పాలనను చూసి అని స్పష్టం చేశారు. రాష్ట్రమంతా తిరుగుతున్నా బండి సంజయ్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.