- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదువేల ఎకరాలకో.. రైతు వేదిక : ముత్తిరెడ్డి
దిశ, హుస్నాబాద్: ఐదువేల ఎకరాలకు ఒక్క రైతు వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం మద్దూరు మండలం లద్నూరు గ్రామంలో ఎమ్మెల్యే రైతు వేదిక భవనానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతాంగం సుభిక్షంగా ఉంటే ప్రజలు సుఖశాంతులతో ఉంటారనే ఉద్దేశంతో రైతుబంధు, ఉచిత విద్యుత్‌తో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులను రాజులుగా చేయడమే సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
ఈ వేదికకు ప్రత్యేకమైన అధికారిని నియమిండమే కాకుండా ఏ సీజన్‌లో ఏ పంటలేయాలి, అదే విధంగా ఏ సమయంతో ఎరువులు, పంటల అభివృద్ది వాటి విధివిధానాలపై రైతులకు అగ్రికల్చర్ ఆఫీసర్లు పలు సూచనలు ఇవ్వనున్నట్టు తెలిపారు. నూతన పంటల మార్పిడి విషయంలో నియోజకవర్గంలోని రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని తెలిపారు. మూడేళ్ళలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన గొప్ప ప్రజా నాయకుడన్నారు కేసీఆర్ అన్నారు.