- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
నా పదవికి రాజీనామా చేస్తా.. బండి సంజయ్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి సవాల్..!
దిశ, కుత్బుల్లాపూర్ : నా ఇంటి వద్ద ఆందోళన చేసిన వారిని తిట్టినట్లు రుజువు చేస్తే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సవాల్ విసిరారు. ఆగస్టు 15వ తేదీన జరిగిన ఘర్షణ నేపథ్యంలో దూలపల్లిలోని తన నివాసం వద్ద దళితులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో ఎమ్మెల్యే వారిని బూతులు తిట్టారని.. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించినా స్పందించలేదని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయగా 24 గంటల్లో మైనంపల్లిని అరెస్ట్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఆయన గురువారం దూలపల్లిలోని తన నివాసం వద్ద విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఎస్సీ మహిళలు తన ఇంటిపై గుడ్లు, రాళ్లతో దాడి చేసిన సమయంలో తాను ఇంట్లో లేనన్నారు. కానీ, బండి సంజయ్ కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆ సమయంలో నేనున్నానో.. లేనో సీసీ టీవీ పుటేజీలో చూస్తే తెలుస్తుందన్నారు. తనను జైలుకు పంపినా మళ్లీ వస్తానన్నారు. అవసరమైతే నిజం తేలే వరకు జైలులోనే ఆమరణ దీక్ష చేస్తానని సవాలు విసిరారు. బండి సంజయ్ బండారం బయటపెడతానని, పూర్తి ఆధారాలతో ప్రెస్ మీట్ పెడతానన్నారు. తాను భయపడే వ్యక్తిని కాదని, భయపడితే రాజకీయాల్లో ఉండలేమన్నారు.
నువ్వు ఒక్క చెంపపై కొడితే రెండు చెంపలు కొట్టేవాడినన్నారు. మైలేజీ కోసమే బండి ఉబలాటపడుతున్నాడని విమర్శించారు. కొన్ని చానళ్లు ఒకవైపే ప్రసారం చేస్తున్నాయని, అలా చేస్తే కొలాప్స్ అవుతారని పరోక్షంగా హెచ్చరించారు. మహిళలు వచ్చిన సమయంలో తాను ఇంట్లో ఉన్నట్లు రుజువైతే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. నా కుమారుడు ముంబైలో ఉంటే అతన్ని ఏ2గా చేర్చడం ఏమిటని ప్రశ్నించారు. నాకు కులం ఫీలింగ్ లేదని, దళితులకు చేసిన సేవలు లెక్కలేనన్ని ఉన్నాయన్నారు. సంజయ్ నాపై ఎన్ని కేసులు పెట్టినా జైలులో ఉండైనా, నీ పదవి ఊడే వరకు నిద్రపోనని హెచ్చరించారు. ఎక్కడైనా సరే ఎలాంటి చర్చకైనా సిద్ధమని, ఎక్కడికి వస్తావో రా.. అని మైనంపల్లి సవాల్ విసిరారు.