- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ మూడు మున్సిపాలిటీలకు రూ.169.18 కోట్లు మంజూరు
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిబట్ల, పెద్ద అంబర్‌పేట్, తుర్కయాంజాల్ మున్సిపాలిటీల్లో తాగునీటి రిజర్వాయర్ల నిర్మాణం, కాలనీలకు మంచినీటి పైపులైన్లు వేయడం కోసం రూ. 164 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ ఆఫీసును కిషన్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రూ. 38 కోట్ల వ్యయంతో ఇప్పటికే పైపులైన్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతం మంజూరైన నిధులతో తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో 218 కి.మీ., పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీలో 140 కి.మీ., ఆదిబట్ల మున్సిపాలిటీలో 36 కిలో మీటర్ల మేర పైపులైన్లు ఏర్పాటు చేస్తామన్నారు.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో కమ్మగూడ, తొర్రూరు, కోహెడ (ఉప్పరిగూడ)లో 3.50 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల వాటర్ రిజర్వాయర్లు నిర్మిస్తామన్నారు. పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని తట్టి అన్నారం, సీఎన్‌ఆర్ క్రికెట్ గ్రౌండ్స్, పెద్ద అంబర్‌పేటలో 4 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల వాటర్ రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పడుతున్న కాలనీలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ 30 సంవత్సరాల వరకు తాగునీటి అవసరాలను తీర్చేవిధంగా, ప్రణాళికాబద్దంగా ఈ నిధులను వినియోగిస్తున్నట్లు తెలిపారు.
తుర్కయాంజాల్ పరిధి రాగన్నగూడ లక్ష్మీ మెగా టౌన్ షిప్‌లో సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం 5.18కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. తమ నియోజకవర్గానికి నిధులు అవసరమని అడగ్గానే మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, మంత్రులు కేటీఆర్, సబితకి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మల్ రెడ్డి అనురాధ, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ హరిత, కమిషనర్ జ్యోతి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.