- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏం సాధించాం అనే వారికి… వాటిని చూపించండి

X
దిశ, పటాన్‌చెరు: ఒకవైపు అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు, మరోవైపు సంక్షేమ రంగానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్‌చెరు పట్టణంలోని గోకుల్‌నగర్‌లో రూ.2 కోట్ల వ్యయంతో యాదవ కళ్యాణ మండపం నిర్మాణానికి ఆదివారం శంకుస్థపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏమి సాధించాం అన్న వారికి నేడు జరుగుతున్న అభివృద్ధి పనులను చూపించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. యాదవ కల్యాణమండపం నిర్మాణం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల వివాహాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
Next Story