- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హామీ ఇచ్చాం… అమలు చేస్తున్నాం
దిశ, పటాన్‌చెరు: గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా రూ.50 కోట్లతో చేపట్టిన బీరంగూడ, కిష్టారెడ్డిపేట రహదారి విస్తరణ పనులను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పలు సాంకేతిక కారణాలు, కోవిడ్ మూలంగా రహదారి విస్తరణ పనులు కొద్దిగా ఆలస్యంగా ప్రారంభం అయినట్టు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే నిధులు కేటాయించి, త్వరితగతిన పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకున్న సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
వచ్చే నాలుగు నెలల్లో రహదారి పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. రహదారికి ఇరువైపులా డ్రైనేజీ, మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. రహదారి నిర్మాణం జరిగే సమయంలో సమీప కాలనీల ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ఆయన కోరారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని అన్నారు.