ప్రైవేట్ భూముల్లో వారి జోక్యం లేకుండా చేస్తా: ఎమ్మెల్యే కేపీ వివేకానంద

by Shyam |   ( Updated:2021-08-27 05:27:31.0  )
ప్రైవేట్ భూముల్లో వారి జోక్యం లేకుండా చేస్తా: ఎమ్మెల్యే కేపీ వివేకానంద
X

దిశ, కుత్బుల్లాపూర్: ప్రైవేట్ భూముల్లో డిఫెన్స్ శాఖ జోక్యం లేకుండా కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. యూనియన్ డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఓరం జోల్ నగర పర్యటనలో ఉన్న సందర్భంగా ఎమ్మెల్యే శుక్రవారం కలిసి సమస్య లేకుండా చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని 101, 105 సర్వే నెంబర్లలోని శ్రీరామ్ నగర్, పద్మనగర్‌లలో గత 30 సంవత్సరాల క్రితం వెంచర్‌లు వేయగా ప్రజలు కొనుగోలు చేసుకుని.. నిర్మాణాలు చేపట్టారన్నారు. అయితే, 2018 నుంచి డిఫెన్స్ శాఖ కలుగజేసుకొని ఆ భూములు తమవని, కొత్త నిర్మాణాలు చేయొద్దని నోటీసులు ఇస్తున్నారన్నారు. కష్టపడి కొన్న భూముల్లో ఇండ్లు నిర్మించకుండా చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, సమస్య లేకుండా చూడాలని వినతిపత్రంలో కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed