- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడండి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

X
దిశ, కుత్బల్లాపూర్ : ప్రజలకు ఇబ్బందుల్లేకుండా నీటి సౌకర్యం కల్పించాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి, నిజాంపేట, దుండిగల్ తదితర ప్రాంతాలకు చెందిన జలమండలి అధికారులతో ఆయన పేట్ బషీరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైప్ లైన్ మెయింటెనెన్స్ పై దృష్టి సారించాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో పైప్ లైన్ వేయించి, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. జీఎం సంతోష్ కుమార్, డీజీఎంలు త్రినాధ్, శ్రీనావాస్, మేనేజర్లు సాయిరాంరెడ్డి, రవిందర్, సత్యనారాయణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Next Story