- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పరకాల ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే చల్లా పర్యటన
దిశ ప్రతినిధి, వరంగల్ : పరకాల నియోజకవర్గంలోని ఏరియా హాస్పిటల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం ఉదయం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్న కొవిడ్ వార్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరకాలలో సీఎం కేసీఆర్ గారి చొరవతో, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సహకారంతో 10 ఆక్సిజన్ బెడ్స్ తో కూడిన వార్డు ఏర్పాటు చేశామని అందులో భాగంగా నిర్మాణ పనులు పరిశీలించడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ కరోనా నివారణకు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న వైద్య ఆరోగ్య, పారిశుధ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరూ ఇండ్లలోనే ఉండి, సురక్షితంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ జిల్లా డిహెచ్ఎంఓ డా. చల్లా మధుసూదన్, సూపరింటెండెంట్ డా. ఆకుల సంజీవయ్య, కౌన్సిలర్లు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.