- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘దిశ’ సమాజ హితానికి దోహదపడాలి: హన్మంత్ షిండే

X
దిశ, జుక్కల్ ; దిశ దినపత్రిక సమాజ హితానికి దోహదపడాలని జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే అన్నారు. జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ఆదివారం దిశ దినపత్రిక 2021 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేసే విధంగా, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా దిశ పత్రిక పని చేయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ అశోక్ పటేల్, మాజీ జెడ్పీటీసీ సాయిరాం, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, సొసైటీ చైర్మన్ బాలాజీ ,నాయకులు డాక్టర్ రాజు, నూకల రాజు, ఉప సర్పంచ్ నాగరాజు, నిజామాబాద్ దిశ ప్రతినిధి అంతడప్పుల రామకృష్ణ, క్రైమ్ ప్రతినిధి ఎడ్ల బాలకృష్ణ, జుక్కల్ నియోజకవర్గ ఇంఛార్జ్ గోనె లాలయ్య పాల్గొన్నారు.
Next Story