- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘రాష్ట్రం ఎక్కడా వెనుకంజ వేయలేదు’

X
దిశ, పటాన్‌చెరు: కరోనా సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా వెనుకంజ వేయలేదని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రమైన గుమ్మడిదలతో పాటు, జిన్నారం, బొల్లారంలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
కరోనా మహమ్మారి మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఏర్పడినప్పటికీ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు. కరోనా వ్యాధి తీవ్రతను గుర్తించి పెద్ద సంఖ్యలో ఐసోలేషన్ కేంద్రాలు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేసి, మెరుగైన చికిత్సను అందించామన్నారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
Next Story