- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రైల్వే అండర్ బ్రిడ్జి త్వరలో ప్రారంభం : ఎమ్మెల్యే గణేష్ గుప్తా

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట రైల్వే కమాన్ వద్ద నిర్మితమవుతున్న అండర్ బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే గుణేష్ గుప్తా ఆదివారం పరిశీలించారు. అనంతరం పట్టణంలోని దుబ్బలో పర్యటించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్నఅండర్ బ్రిడ్జి నెలరోజుల్లోగా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కరోనా వైరస్ పట్ల ఎటువంటి ఆందోళన అవసరం లేదన్నారు. జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ను అరికట్టవచ్చని చెప్పారు. అత్యవసర సమయాల్లో తప్పితే అనవసరంగా బయటికి రావొద్దని సూచించారు. కరోనా నివారణకు సామాజిక దూరం పాటింఃచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మార్గ దర్శకాలని పాటిస్తూ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీతు కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేశ్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Nizamabad,urban Mla Ganesh gupta,Inspect Under bridge works