వారికి పునరావాసం కల్పించండి: ఎమ్మెల్యే గండ్ర

by Shyam |
వారికి పునరావాసం కల్పించండి: ఎమ్మెల్యే గండ్ర
X

దిశ, భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లోని దుబ్బపల్లి గ్రామ వాసులకు పునరావాసం కల్పించాలని టిఎస్ జెన్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రావును ఎమ్మెల్యే గండ్ర కోరారు. హైదరాబాద్ లోని టి ఎస్ జెన్కో కార్యాలయం, విద్యుత్ సౌధ లో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా దుబ్బపల్లి ప్రజలు పడుతున్న ఇబ్బందుల పై చర్చించారు. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కొరకు రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని కోరారు. అదే విధంగా భూపాలపల్లి నియోజకవర్గం లో సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని కోరారు.

Next Story

Most Viewed