- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ దేశానికి ఆదర్శం : ఎమ్మెల్యే గాదరి కిషోర్
దిశ, తుంగతుర్తి: దళితబంధు పథకం దళితుల దిశను మార్చనుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. పైలట్ ప్రాజెక్టుగా తిరుమలగిరిలో ‘దళితబంధు’ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన సందర్భంగా బుధవారం మున్సిపల్ కేంద్రంలోని స్థానిక చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి టపాసులు కాల్చారు. అనంతరం ఎమ్మెల్యే కిషోర్ కుమార్ మాట్లాడుతూ… దళితుల మనోభావాలను, అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకం తీసుకొచ్చారని తెలిపారు. తిరుమలగిరిలోని మొత్తం 2300 కుటుంబాలకు ‘దళితబంధు’ అందజేయనున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా అమలు కానీ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, ఎంపీపీ స్నేహలత, జెడ్పీటీసీ దూపటి అంజలి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మూల అశోక్ రెడ్డి, నాయకులు శోభన్ బాబు, తిరుమణి, యాదగిరి, పోతరాజు మల్లేశ్, పోతరాజు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.