వినాయకచవితి ఇళ్లలోనే జరుపుకోవాలి

by Shyam |   ( Updated:2020-08-11 08:59:48.0  )
వినాయకచవితి ఇళ్లలోనే జరుపుకోవాలి
X

దిశ, కోదాడ: ప్రజా ఆరోగ్యం దృష్ట్యా వినాయక చవితి వేడుకలు ఇళ్లలోనే జరుపుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో మున్సిపల్, పోలీస్, పురోహితులు, గణేష్ ఉత్సవ కమిటీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

పట్టణంలోని పుర వీధుల్లో మండపాల ఏర్పాటుకు, విగ్రహ ప్రతిష్టకు, మైకులకు పోలీసుల నుంచి ఎటువంటి అనుమతులు ఉండవని స్పష్టం చేశారు. విగ్రహాల తయారీదారులు క్రయ విక్రయాలు జరపవద్దన్నారు. పురోహితులు సైతం మండపాల వద్దకు వెళ్లకుండా పోలీసులకు సహకరించాలన్నారు. కరోనా నివారణ కోసం పట్టణ ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.

Advertisement

Next Story