- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘శుభప్రద’ కంపెనీకి అన్నీ శుభాలే జరగాలి : ఎమ్మెల్యే అంజయ్య
దిశ, శేరిలింగంపల్లి: రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేసుకుంటున్న శుభప్రద ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ 9వ ఫేస్(గోకుల్ ప్లాట్స్)లో ప్రారంభించింది. బుధవారం రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రెసిడెంట్ వెంకటేష్ యాదవ్‌తో కలిసి షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థిరాస్తి రంగంలో ఎన్నో సంస్థలు తమ వెంచర్లను ప్రారంభిస్తున్నా.. వినియోగదారుల అభిరుచికి, ఆసక్తి తగ్గట్టుగా అన్ని వర్గాలకు అనువైన స్థలాల్లో వెంచర్లను ప్రారంభిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్న శుభప్రద ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అన్నీ శుభాలే జరగాలని ఆకాంక్షించారు.
సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి శుభప్రద సంస్థ చక్కని మార్గనిర్దేశం చేస్తుందని, అనువైన చోట మంచి స్థలాలను అందిస్తుందన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో, కాలుష్య రహిత ప్రదేశంలో జీవనం సాగించడానికి మొగ్గు చూపుతున్నారని, వినియోగదారుల నమ్మకం వమ్ము కాకుండా ఈ సంస్థ ప్రజలకు సేవలందించాలని ఎమ్మెల్యే అంజయ్య సంస్థ ప్రతినిధులను కోరారు. వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరతో 10 సంవత్సరాలు ఉచిత మెయింటినెన్స్‌తో ప్రజలకు ప్రతి వెంచర్‌ని అందుబాటులోకి తీసుకొని వచ్చినట్లు సంస్థ చైర్మన్ సాయిబాబా తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.