సీఎం త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పూజలు 

by Shyam |
సీఎం త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పూజలు 
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : కరోనా బారిన పడిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మంగళవారం కురుమూర్తి స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయమే పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన కురుమూర్తి ఆలయం వద్దకు చేరుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆయనకు కరోన సోకడం ప్రజలందరికీ బాధాకరమైన అంశమని అన్నారు. ఆయన కరోనా నుండి వెంటనే తేరుకొనేలా చూడాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, కరుణ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story