బ్యాటరీ లేని వాహనాల అమ్మకాలపై మిశ్రమ స్పందన

by Anukaran |   ( Updated:2020-08-14 06:11:38.0  )
బ్యాటరీ లేని వాహనాల అమ్మకాలపై మిశ్రమ స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: ముందుగా అమర్చిన బ్యాటరీ(Battery)లు లేకుండా ఎలక్ట్రిక్ వాహనాల(Electric vehicles) అమ్మకాలు, రిజిస్ట్రేషన్లను అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ నుంచి మిశ్రమ స్పందన(Mixed response) వ్యక్తమవుతోంది. ప్రభుత్వ అనుమతి తర్వాత టూ-వీలర్(Two-wheeler) కంపెనీల్లో ఎక్కువ శాతం దీన్ని స్వాగతించినప్పటికీ, ఇలాంటి విధానం ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఎక్కడా లేదని మహీంద్రా ఎలక్ట్రిక్ కంపెనీ(Mahindra Electric Company) అభిప్రాయపడింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ సంప్రదించి తీసుకున్నట్టుగా లేదని పేర్కొంది. ఈ పరిణామాలతో బ్యాటరీ(Battery)లు లేకుండా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల విషయంలో ఈ పరిశ్రమ గందరగోళంలో పడింది. అయితే, పరిశ్రమల అభిప్రాయానికి విరుద్ధంగా ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీల(Electric vehicle manufacturing companies) సంఘం మాత్రం..ఎలక్ట్రిక్ వాహనాల నుంచి బ్యాటరీని వేరు చేయడమనే ఆలోచన సరైనదే అని వెల్లడించింది.

కానీ, వినియోగదారులు(Customers) ఈ వాహనాలను కొనుగోలు చేసేందుకు ముందుకు రావాలంటే బ్యాటరీ(Battery)లపై ప్రస్తుతమున్న 18 శాతం జీఎస్టీ(GST)ని 5 శాతానికి తగ్గించడం లాంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. బ్యాటరీ లేని ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల నిర్ణయం వల్ల వాహనదారులు (Motorists) ముందుగా చెల్లించే వ్యయంలో కొంత తగ్గుతుందని హీరో ఎలక్ట్రిక్, యాంపియర్ ఎలక్ట్రిక్, ఆథర్ ఎనర్జీ, ఒకినవా కంపెనీలు అభిప్రాయపడుతున్నట్టు తెలిపాయి. ప్రభుత్వం నిర్ణయం రానున్న రోజుల్లో వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపించే విధంగా ఉందన్నారు.

Advertisement

Next Story