మిత్రోన్ యాప్‌‌ను తీసేసిన గూగుల్ ప్లేస్టోర్

by Shamantha N |
మిత్రోన్ యాప్‌‌ను తీసేసిన గూగుల్ ప్లేస్టోర్
X

టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ఇండియాలో రూపొందిన యాప్ అనే ప్రచారంతో విడుదలైన మిత్రోన్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ తొలగించింది. 5 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్లు అయిన ఈ యాప్‌ను తొలగించడానికి గల కారణం గురించి అటు గూగుల్ కానీ, ఇటు మిత్రోన్ వారు కానీ వివరణ ఇచ్చుకోలేదు. అయితే సెక్యూరిటీ కారణాల రీత్యా ఇలా జరిగి ఉండొచ్చని నిన్నటి వరకు మీడియాలో వచ్చిన కథనాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికే మిత్రోన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఉన్నట్లయితే దాన్ని ఉపయోగించవద్దని నిపుణులు సిఫారసు చేస్తున్నారు. వీలైతే డేటా క్లియర్ చేసి డిలీట్ చేయాలని సలహా ఇస్తున్నారు. ఈ యాప్‌ను ఐఐటీ రూర్కీ విద్యార్థి శిబాంక్ అగర్వాల్ రూపొందించారు. అయితే దీని సోర్స్ కోడ్‌ను పాకిస్థాన్‌కు చెందిన క్యూబాక్సస్ కంపెనీ వారి టిక్‌టిక్ యాప్ నుంచి తీసుకున్నట్లు తేలింది. సోర్స్ కోడ్‌తోపాటు అందులో ఉన్న సెక్యూరిటీ తప్పిదాలను కూడా ఉన్నవి ఉన్నట్లుగా కోడ్‌లో కాపీ చేశారని క్యూబాక్సస్ ప్రకటించింది. ఆ ప్రైవసీ సమస్యల కారణంగా మిత్రోన్ యాప్‌ను సులభంగా హ్యాక్ చేయవచ్చని అనడంతో సెక్యూరిటీ సమస్యల రీత్యా యాప్‌ను డిలీట్ చేసి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story