- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విదేశీ ప్రయాణికుల మిస్సింగ్ వార్తలు అన్ని అబద్దం.. వారంతా అక్కడే ఉన్నారు..
దిశ, ఏపీ బ్యూరో: విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన 30 మంది ప్రయాణికులు మిస్సయ్యారనే వార్త గత కొన్ని గంటలుగా పెద్ద ఎత్తున హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి క్లారిటీ ఇచ్చారు. అమరావతిలో శుక్రవారం మీడియాతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ హైమావతి మాట్లాడుతూ.. విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన 30 మంది ప్రయాణికులు మిస్సయ్యారనే వార్తల్లో వాస్తవం లేదని వెల్లడించారు. ఇలాంటి వదంతుల్ని ఎవరూ నమ్మొద్దని.. రాష్ట్ర ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వైజాగ్, సమీప జిల్లాలకు చెందిన 30 మంది అంతర్జాతీయ ప్రయాణికుల వివరాల్ని కేంద్రం రాష్ట్రానికి పంపించిందని పేర్కొన్నారు. వారి వారి ఇళ్లల్లో ఐసోలేషన్లో ఉండేలా మా వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు.
విదేశాల నుంచి రాష్ట్రంలో ప్రయాణికులు దిగడానికి ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవని.. వందే భారత్ స్కీం కింద విజయవాడ విమానాశ్రయానికి కొన్ని విమానాలొస్తున్నాయని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం విజయవాడ విమానాశ్రయంలో వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో ఇప్పటికే వైద్య బృందాల్ని ఏర్పాట్లు చేశామని.. వైద్య బృందాల పర్యవేక్షణలో నిరంతరం స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ హైమావతి స్పష్టం చేశారు.