- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పింఛన్లు ఇవ్వడానికి వెళ్లి బాలికపై అఘాయిత్యం
దిశ, వెబ్‌డెస్క్: స్నానం చేసి ఇంట్లోకి వెళ్లిన బాలికపై గ్రామ వాలంటీర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం గూడూరుపల్లెలో శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత తల్లిదండ్రుల కథనం ప్రకారం..జూలై 1వ తేదీన గ్రామ వాలంటీర్ నరేష్ గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు వచ్చాడు.ఈ క్రమంలోనే ఓ వృద్ధురాలి ఇంటికి వెళ్లిన అతడు..అప్పుడే స్నానం చేసి ఇంట్లోకి వెళ్లిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలిక తొమ్మిదో తరగతి చదువుతున్నట్టు సమాచారం.
ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో బాలిక ఎవరికీ ఈ విషయాన్ని తెలపలేదు. కూతురు డల్ గా ఉండటం గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం చెప్పి విలపించింది. అయతే, ఈ విషయంపై కేసు పెట్టకుండా ఉండేందుకు స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించినట్లు తెలుస్తోంది.అక్కడ న్యాయం జరగకపోవడంతో తల్లిదండ్రులు పుంగనూరు పోలీసులను ఆశ్రయించారు. అయితే, పోలీసులు కూడా తమ గోడును పట్టించుకోవడం లేదని బాధితురాలి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితురాలిని వి.కోటలోని బంధువుల ఇంటికి తరలించారు.ఎలాగైనా నిందితునిపై కేసు నమోదు చేసి, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.