- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాలికపై సామూహిక అత్యాచారం
దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ బాలిక (16) పై కొన్ని మానవ మృగాలు కిరాతకంగా ప్రవర్తించాయి. మైనర్‌ను కిడ్నాప్ చేసి గదిలో బంధించిన ఏడుగురు దుండగులు నాలుగు రోజులుగా అత్యాచారానికి పాల్పడుతూ.. చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం ఆ బాధితురాలిని దగ్గరలోని పోలీస్‌స్టేషన్ బయట వదిలి పరారయ్యారు. ప్రస్తుతం అత్యాచార బాధితురాలు రాజమండ్రిలోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే, తమ కూతురు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఐదు రోజుల కిందట కోరుకొండ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఎంతకూ ఆమె ఆచూకీ లభించలేదు. ఇదిలాఉండగా, బాధిత కుటుంబం చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తుండగా ఆ బాలిక కూడా అందులోనే పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ఆమెపై కన్నేసిన దుండగులు బాలికను కిడ్నాప్ చేసి దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. కాగా, తమ కూతురికి జరిగిన అన్యాయం విషయంలో తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేయగా, పోలీసులు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.