- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాలిక ప్రాణం తీసిన వాట్సప్ స్టేటస్.. అసలు ఏం జరిగిందంటే..?

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సమాజంలో యువత బలవన్మరణాలు ఎక్కువైపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలను వదిలేస్తున్నారు. ఇక వీరి ఆత్మహత్యలకు కొన్నిసార్లు సోషల్ మీడియా కూడా కారణమవుతుంది. తాజాగా ఓ బాలిక తన ఫోటోను ఓ బాలుడు వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బొమ్మలరామారంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనాల ప్రకారం.. బోయిన్‌పల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక(14) మాడు చింతలపల్లి మండలం పోతారం గ్రామంలో ఉన్న కూరగాయల తోటలో కూలీగా పనిచేస్తుంది. ఆమెకు గత కొన్ని రోజుల క్రితం బోటిమీది తండాకు చెందిన తేజావత్ మధుతో పరిచయం ఏర్పడింది. దీంతో వారిమధ్య పరిచయం స్నేహంగా మారింది.
బాలుడు బాలికతో ఉన్న చనువు కొద్దీ సదరు బాలిక ఫొటోను శుక్రవారం తన వాట్సప్ స్టేటస్‌లో పెట్టాడు. అది చూసిన బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. వెంటనే తాను పనిచేస్తున్న తోటలోనే పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాలుడిని అరెస్ట్ చేశారు. బాలుడి వేధింపులు తాళలేక తమ కూతురు ఆత్మహత్య చేసుకొందని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.