- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీటి కష్టాలు తప్పాయి..రైతులు ఎం చేయాలంటే
దిశ, కరీంనగర్:
రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో నీటి కష్టాలు తొలగిపోయాయని చెరువులు, కుంటలు అన్ని నీళ్లతో కలకలలాడుతున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.ఆదివారం జిల్లా కలెక్టరేట్లో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నియంత్రిత వ్యవసాయ విధానంపై మంత్రులు ఈటల, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ..ఎస్సారెస్పీ పునర్జీవన పథకంతో నీటి కొరత లేకుండా పోయిందన్నారు.గతంలో ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ కెనాల్స్ ద్వారా నీరు వదిలినప్పుడు మాత్రమే పంటలు పండించే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జిల్లాలోని అన్ని చెరువులు నింపామన్నారు. దీంతో వర్షాలపై ఆధార పడకుండా పంటలు పండించే స్థితికి జిల్లా వచ్చిందన్నారు. కరీంనగర్ జిల్లా రైస్ బౌల్ అఫ్ తెలంగాణగా మారిందన్నారు. జిల్లాలో వరి పంటకు బదులు పత్తి, కంది, పెసర పంటలు వేయాలని రైతులకు సూచించారు.వానాకాలం సన్నరకం ధాన్యాన్ని పండించాలని,దీనికి చాలా డిమాండ్ ఉందని మంత్రి వివరించారు. అలాగే పసుపు, సోయాబిన్, పసుపులో అంతరపంటగా మక్క పండించడం వల్ల కూడా ఆదాయం పెరుగుతుందని చెప్పారు.మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. సీఎం ఆలోచన పునర్జీవన విధానంతో కాళేశ్వరం ప్రాజెక్టు, రిజర్వాయర్ల నిర్మాణం ద్వారా ఉమ్మడి జిల్లాలో ప్రతి ప్రాంతానికి నీరు సమృద్దిగా లభ్యం అవుతోందన్నారు. జిల్లా అధికారులు అందరూ కలిసి అన్నిప్రాంతాల్లోని చెరువులకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మంత్రి గంగుల మాట్లాడుతూ..రానున్న రోజుల్లో డిమాండ్ ఉన్న పంటలు, ప్రొడక్షన్ ఉన్న పంటలు వేయడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర వస్తుందన్నారు.ఆధునిక విధానాలతో పంటలు పండించడం వల్ల అధిక దిగుబడులు సాధించి లాభాలు ఆర్జించవచ్చని వివరించారు.అందుకు వ్యవసాయ అధికారులు మీకు సలహాలు సూచనలు చేస్తారన్నారు. సమావేశంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, నారదాసు లక్ష్మన్ రావు, జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ అధ్యక్షులు కనుమల్ల విజయ, పుట్ట మధుకర్, వసంత, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సతీష్ బాబు, కోరుగంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, సంజయ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లాల కలెక్టర్లు కె.శశాంక, సిక్తా పట్నాయక్, రవిలు పాల్గొన్నారు.